Andhra PradeshHome Page Slider

ఎవరొస్తారో రండి తేల్చుకుంటా.. ముఖ్యమంత్రి వచ్చినా సై…

వచ్చే ఎన్నికల్లో గొడవలు ఎక్కువ జరిగే అవకాశముందన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. అధికారం పోతుందని… వైసీపీ దాడులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నారు. జనసేన నాయకులు వ్యూహాన్ని తనకు వదిలేయాలన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. వ్యూహాన్ని నాకు వదిలేయండంటూ పదేపదే అభిమానులకు విజ్ఞప్తి చేశారు. వేల కోట్లు నిధుల్లేకున్నా కేవలం సైద్ధాంతిక బలంతో పార్టీని పదేళ్లుగా నడుపుతున్నానన్నారు. చాలా మంది పెద్దలు రాజకీయాల్లోకి వచ్చారన్న పవన్… అధికారం రాని కుల సమూహాల నుంచి ఒక్కరు కూడా ముందుకు వెళ్లలేకపోయారన్నారు. దశాబ్దం నుంచి జనసేన పార్టీని నడుపుతున్నానంటూ చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు సంబంధించి ఎన్నికల వ్యూహాన్ని నాకు వదిలేస్తే… జనసేనను ముందుండి అధికారంలోకి తెచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు. నన్ను నమ్మాండంటూ అభిమానులను పదేపదే పవన్ కోరారు. ఏ నాయకులు నాకు వేల కోట్లు, వందల కోట్లు ఇచ్చినవారు లేరన్నారు. ఉన్నవారంతా… చిన్నపిల్లలని… కొత్త వారని… వారెవరూ కూడా అధికారం చూడని వ్యక్తుల సమూహమన్నారు. వ్యూహం నాకు వదిలేస్తే… వైసీపీ సంగతి తేల్చుతానన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అందుకు కట్టుబడి ఉన్నానన్నారు. వైసీపీ గాడిదలు ఏం కూసినా… అధికారంలోకి రావట్లేదని పవన్ జోస్యం చెప్పారు. మీరు ఓడిపోతున్నారన్నారని… వైసీపీ నేతలకు తేల్చి చెప్పారు పవన్. అలాగే ఏపీ రోడ్లపై తన ఎన్నికల వాహనం వారాహీ తిరుగుతుందని… ఎవరు ఆపుతారో చూస్తానన్నారు. మీ ముఖ్యమంత్రిని రమ్మనండి లేదంటే… కూసే గాడిదలను రమ్మనాలంటూ హెచ్చరించారు. నా వారాహిని ఆపండి అప్పుడు తానేంటో చూపిస్తానంటూ గర్జించారు పవన్ కల్యాణ్.