సింహాచలం ఘటనపై పాల్ సీరియస్
ఏపీలోని విశాఖ సింహాచలంలో చందనోత్సవం సంధర్భంగా భారీ వర్షానికి క్యూలైన్‌పై గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. ఈ ఘటనపై ప్రజా శాంతి పార్టీ పాల్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో ను రిలీజ్ చేశారు. ‘‘ ప్రజల దగ్గర నుంచి టిక్కెట్ల రూపంలో లక్షల కోట్లు వసూల్ చేస్తున్నారు.. దానిలో కొంచెం ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించలేరా?. ఇప్పుడే ఇలా ఉంటే రేపు వర్ష కాలంలో ఎన్ని దేవాలయాలు కూలిపోతాయి.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు పాల్.