Andhra PradeshHome Page Slider

“నాకు పేరొస్తుందనే ఏపీలో పట్టిసీమను 5 ఏళ్లు ఆపేశారు”: సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖపై శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో టీడీపీ హయాంలో ప్రారంభించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని గత వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని సీఎం దుయ్యబట్టారు. కాగా మా హయాంలో ఏపీని కరెంట్ కోతల నుంచి మిగులు కరెంట్‌లోకి తెచ్చామన్నారు.రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకువచ్చామని తెలిపారు. మరోవైపు వ్యవసాయం కోసం పట్టిసీమతో నదుల అనుసంధానం చేశామన్నారు. అయితే పట్టిసీమ వల్ల నాకు పేరు వస్తుందనే వైసీపీ ప్రభుత్వం దాదాపు 5 ఏళ్లు దానిని ఆపేసిందని సీఎం ఆరోపించారు.కాగా వైసీపీ నిర్లక్ష్యంతోనే పోలవరం అన్నివిధాల నష్టపోయిందని సీఎం విమర్శించారు. అంతేకాకుండా మహానగరంగా అభివృద్ధి చెందే అమరావతిని కూడా వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని సీఎం మండిపడ్డారు.