Home Page SliderTelangana

పాతబస్తీ ఉగ్రవాదుల అడ్డా: బండి సంజయ్

హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే దీనిపై తెలంగాణా బీజేపీ ఛీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందన్నారు.  ఉగ్రనేత ఒవైసీ కుటుంబానికి చెందిన వారేనన్నారు. హైదరాబాద్‌లో ఉగ్రలింకులపై పోలీసులు ఆలోచించాలన్నారు. ఉగ్రవాదులకు MIM స్థావరం కల్పిస్తోందన్నారు. ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తూ..ఓవైసీ గతంలో మాట్లాడిందన్నారు. కాగా ఇటీవల పోలీసులకు పట్టబడ్డ ఉగ్రవాది ఒవైసీలో పనిచేస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.