టీడీపీని గెలిపించేందుకు పార్టీ పెట్టలేదు:పవన్ కళ్యాణ్
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి.ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ నేతలను సీఎం చేసేందుకు జనసేన పార్టీ పెట్దలేదన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా జనం వస్తారన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా భారీగా జనం వస్తారు. కానీ ఆ జనాన్ని ఓటర్లుగా మార్చడం చాలా కష్టమని పవన్ తెలిపారు. తెలంగాణాలో ఉన్న ఎంఐఎం పార్టీలా ఏపీలో జనసేనకు గత ఎన్నికల్లో 7 సీట్లు కూడా రాకపోవడం బాధ కలిగించిందన్నారు. ఎక్కడైనా నిజాయితీగా రాజకీయాలు చేస్తే పరాభవం ఇలానే ఉంటుందన్నారు. అయినా సరే ఈ పరాభవాన్ని కూడా గర్వంగానే స్వీకరిస్తున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.