Home Page SliderLifestyleNationalVideosviral

లవర్స్‌ని నడిరోడ్డుపైనే చెప్పుతో కొట్టిన పేరెంట్స్..

తమ కుమారుడు ప్రేమించిన యువతితో తిరుగుతుండగా చూసిన తల్లిదండ్రులు ఇద్దరిని అడ్డగించి నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగానే కొట్టారు. ఈ ఘటన కాన్పూర్‌లోని గజాయిని స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  రోహిత్ అనే యువకుడు తన ప్రియరాలితో కలిసి బైక్‌పై వెళుతుండగా  చూసిన అతని తల్లిదండ్రులు శివకరణ్, సుశీలలు కుమారుడు రోహిత్‌ను అడ్డగించి అతనితో పాటు ప్రియురాలిని పట్టుకొని కొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ యువతి మాయమాటలు చెప్పి రోహిత్‌ను వలలో వేసుకుందని అతని తల్లి ఆరోపిస్తోంది.  రోహిత్‌ను అతని తండ్రి చెప్పుతో కొడుతున్నట్టు వీడియో తెలుస్తోంది. అయితే రోహిత్ తల్లి అతని ప్రియురాలిని జుట్టు పట్టుకొని కొట్టారు.  పక్కనున్న వారు వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఎలాంటి లాభం లేకపోయింది. ఇక స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ తల్లిదండ్రులతో పాలు ఆ ప్రేమ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.