Home Page SliderNationalSports

డగౌట్‌లో పంత్ జెర్సీ..మండిపడ్డ బీసీసీఐ

ప్రముఖ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీంతో పంత్ IPL 2023కి దూరమయ్యాడు. అయితే జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు..ఢిల్లీ తొలి మ్యాచ్ సందర్భంగా అతడి జెర్సీని డగౌట్‌లో వేలాడదీశారు. దీనిపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు అంతిమ విషాదం,రిటైర్మెంట్ సమయంలోనే చేస్తారని తెలిపింది. కాగా పంత్ బాగానే ఉన్నాడని..ఊహించిన దానికంటే వేగంగానే కోలుకుంటున్నాడని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయొద్దని ఢిల్లీ జట్టుని బీసీసీఐ మందలించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని ఓ ఐపీఎల్ ప్రతినిధి మీడియాకు వెల్లడించినట్లు సమాచారం.