home page sliderHome Page SliderNationalNews

సెంచరీ చేసిన ఆనందంతో పంత్‌ ఫ్లిప్‌ జంప్‌..

ఐపీఎల్‌-18 లీగ్‌ దశ ముగిసింది. చివరి మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీను ఓడించి ఆర్సీబీ క్వాలిఫయర్‌-1కు దూసుకెళ్లింది. ఎల్‌ఎస్‌జీ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎల్‌ఎస్‌జీ జట్టులో కెప్టెన్‌ పంత్‌ (118) దంచికొట్టాడు. వేలంలో అత్యధిక ధర పలికిన పంత్‌ ఈ సీజన్‌లో అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. అయితే చివరి మ్యాచ్‌లో ఫోర్లు, సిక్స్‌లతో అదరగొట్టాడు. 54 బంతుల్లో శతకం చేసిన పంత్‌.. అనంతరం ఆనందంతో ఫ్లిప్‌ జంప్‌ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.