క్రికెట్ స్టార్‌గా మారిన పానీపూరీవాలా
రాజస్థాన్ రాయల్స్ స్టార్ క్రికెటర్ యశస్వీ జైశ్వాల్ సూపర్ షాట్స్‌తో ముంబయిని అదరగొట్టాడు. 124 పరుగులు చేసి మెరుపు సెంచరీ సాధించాడు. కానీ యశస్వి క్రికెటర్‌గా మారక ముందు ఏంచేసేవాడో తెలుసా.. చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. 11 ఏళ్లవయస్సులోనే క్రికెటర్ అవ్వాలనే ఆశతో ముంబయికి వచ్చి మూడేళ్లపాటు పానీపూరీ బండి నడిపాడు. రాత్రివేళ పానీపూరీ అమ్ముతూ, పగలంతా క్రికెట్ కోచింగ్ తీసుకుంటూ టెంట్‌లో నివసించేవాడు. చాలా కష్టపడి ఈస్థాయికి చేరుకున్నాడు. 2020లో అండర్ 19 వరల్డ్ కప్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీనితో ఐపీఎల్ కన్ను ఇతనిపై పడింది. 2020లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగు కోట్లు పెట్టి యశస్విని సొంతం చేసుకుంది. అప్పటి నుండి ఈ జట్టులో కొనసాగుతున్నాడు.


 
							 
							