Home Page SliderTelangana

తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు

తెలంగాణాలో పంచాయితీ ఎన్నికలకు త్వరలోనే ఢంకా మోగనుంది. కాగా తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2,3 తేదిల్లో పంచాయితీ ఎన్నికల విధులు నిర్వర్తించబోయే వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఈసీ తెలిపింది.అయితే పంచాయితీ విధులు నిర్వర్తించడానికి ప్రతి జిల్లా నుంచి 5గురు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు తెలంగాణా సీఎస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.