కర్ణాటక ఎన్నికలలో సందడిగా ఓట్లేసిన ‘పాన్ ఇండియా స్టార్స్’
పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అంటూ మనకు అన్ని భాషల సినీహీరోలు, హీరోయిన్లు తెలుస్తున్నారు. అంతేకాదు వాళ్లు ఇండియన్ స్టార్స్‌గా కూడా మారిపోయారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఓట్లు వేస్తున్నారు. సినీస్టార్స్ కూడా పౌరులే కదా. వారు కూడా ఉత్సాహంగా ఓట్లు వేయడమే కాదు. తమ అభిమానులకు కూడా ఓటు వేయమని ప్రోత్సహిస్తూ వారి ఫొటోలు సోషల్ మీడియాలలో పోస్టు చేస్తున్నారు. కన్నడ హీరోలు ఉపేంద్ర, దర్శన్, శ్రీమురళి, రమేశ్ అరవింద్, మేఘన గోవాంకర్, ప్రకాశ్ రాజు, సుదీప్,కాంతారా స్టార్ రిషబ్ షెట్టి వంటి వారందరూ ఓట్లేశారు. రిషబ్ షెట్టి కర్ణాటక అభ్యున్నతి కోసం ఓటు వేశానని, మీరూ వేయాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఓటింగ్ కొనసాగుతోంది. ఇవే తన చివరి ఎన్నికలని, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన సిద్దరామయ్య కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. యువ ఓటర్లను ఆకర్షించడానికి కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటుచేశారు. దీనితో అందరూ సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.
