Home Page SliderTelangana

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ రైతులకు ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో రైతులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు తాంసిలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి డీసీసీబ ఛైర్మన్ అడ్డి బోజారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతు సంక్షేమానికి అండగా నిలుస్తుందన్నారు. దీనితో పాటు రైతు భరోసా, ఫసల్ బీమా కూడా అమలు చేస్తున్నామని తెలియజేశారు.