పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుదేలు..
పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ విధించిన ఆంక్షల కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్‌సైట్ మూసివేశారు. పాక్ షేర్లన్నీ 2 శాతం పతనం అయ్యాయి. పాకిస్తాన్ మార్కెట్ల నుండి పెట్టుబడిదారులు పారిపోయారని, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరియు అనిశ్చితి పెరగడంతో వారు త్వరగా మూలధనాన్ని ఉపసంహరించుకున్నారని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. పాక్ పౌరులకు వీసాల జారీ నిలిపివేత, సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందం రద్దు వంటి అంశాలతో పాకిస్తాన్‌కు గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూడనుంది. ప్రపంచ అగ్రదేశాలన్నీ భారత్‌కే సపోర్ట్ చేయడంతో ఉగ్రవాద దేశం ప్రతీకార చర్యలకు తెగబడుతోంది. ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుగుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.