Home Page SliderNational

“పాక్ పప్పులు కాశ్మీర్‌లో ఉడకనివ్వం”..ప్రధాని మోదీ

పాకిస్తాన్ అజెండాను, కుట్రలను కాశ్మీర్‌లో అమలు కానివ్వమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండవవిడత ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయన  కాశ్మీర్‌లోని కాట్రాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాశ్మీరులోని మూడు పార్టీల కూటమి వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాశ్మీర్ భవిష్యత్తు కోసం బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌కు కాంగ్రెస్ పార్టీ నదీజలాలు వెళ్లేలా చేస్తే, ఆనకట్టలు తాము నిర్మించామన్నారు. గత కొన్నేళ్లుగా తమ ప్రభుత్వం కాశ్మీరుని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తోందన్నారు. కాంగ్రెస్ కూటమి పార్టీలకు పాక్ రక్షణ మంత్రి మద్దతు తెలపడంతోనే వారి ఎజెండా అర్థం అవుతోందని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని ఏ శక్తి రద్దు చేయలేదన్నారు. జమ్ముకాశ్మీరును త్వరలోనే మళ్లీ రాష్ట్రంగా మారుస్తామని పార్లమెంటులో ప్రకటించామని గుర్తు చేశారు.