Breaking NewsHome Page SliderInternationalPolitics

సింధూ జలాలపై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ మంత్రులు పహల్గాం దాడి తర్వాత యుద్ధోన్మాదాన్ని పెంచే ఉద్రేక పూరిత వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తూ ప్రపంచదృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సింధూ జలాలపై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఎలాంటి నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు. సింధూ జలాల ఒప్పందాన్ని పాక్ లాంటి ఉగ్ర దేశం కోసం అమలు చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది భారత్. అంతేకాదు, పాకిస్తాన్‌కు భారత్‌ సముద్రమార్గాన్ని, ఆకాశమార్గాన్ని కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.