భారత్ మార్కెట్లోకి దొంగదారిలో పాక్ వస్తువులు
కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై వాణిజ్య యుద్ధం కూడా ప్రకటించింది భారత్. పాక్ నుండి దిగుమతి అయ్యే వస్తువులన్నింటిపై నిషేధం విధించింది. కానీ ముఖ్యంగా భారత్ మార్కెట్లపై ఆధారపడిన కొన్ని పాక్ పరిశ్రమలు దొంగదారిలో భారత్ మార్కెట్లలో ప్రవేశించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన పాకిస్థానీ పండ్లు, ఎండు కర్జూరాలు, రాక్ సాల్ట్, టెక్స్‌టైల్స్, లెదర్ వస్తువులను మూడవ దేశం మీదుగా భారత్‌లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. యూఏఈ, సింగపూర్, ఇండోనేసియా, శ్రీలంకలలో రీప్యాకేజీలు చేసి వాటిని అక్కడ నుండి భారత మార్కెట్లలోకి వస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు కనిపెట్టారు. దీనితో అవి ఇక్కడకు ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.