రోహిత్ శర్మపై పాక్ క్రికెటర్ తీవ్ర ఆరోపణలు
ఇవాళ T20 వరల్డ్ కప్ ఇండియా Vs సౌతాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ఫ్యాన్స్ అంతా ఈ మ్యాచ్‌లో ఇండియా పొట్టి కప్పు గెలవాలని తమ ఇష్టదైవాలకు మొక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాక్ క్రికెటర్ ఇంజుమామ్ తీవ్ర ఆరోపణలు చేశారు.కాగా మొన్న జరిగిన ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ జరిగిందంటూ కొందరు ఆరోపించారు. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేసేవారు కాస్త బ్రెయిన్ వాడాలంటూ రోహిత్ శర్మ విమర్శలు గుప్పించారు. దీనిపై పాక్ క్రికెటర్ ఇంజుమామ్ తీవ్రంగా స్పందించారు. క్రికెట్‌లో రివర్స్ స్వింగ్ అంటే ఏంటో మాకు చెప్పొద్దన్నారు. అసలు అదేలా వేయాలో క్రికెట్ ప్రపంచానికి నేర్పిందే మేము అన్నారు. పైగా క్రికెట్‌లో కండీషన్స్ గురించి మాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు. కాగా ఇవన్నీ అంపైర్లు కళ్లు తెరవాలని మాత్రమే నేను చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. అయితే మ్యాచ్ జరిగేటప్పుడు అంపైర్లు బ్రెయిన్ వాడితే ఏ సమస్య ఉండదని పాక్ క్రికెటర్ ఇంజుమామ్ ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు.