పాక్ రక్షణ వ్యవస్థపై ఆ దేశ పౌరుడి ఆగ్రహం
పాక్ రక్షణ వ్యవస్థపై ఆ దేశ పౌరుడి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ పౌరుడు సోషల్ మీడియాలో తన దేశానికి వ్యతిరేకంగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మిసైల్స్ దాడి చేస్తే పాక్ అడ్డుకోలేకపోయిందన్నాడు. పైగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటుందని తెలిపాడు. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడి చేసింది కానీ అమాయకులపై దాడి చేయలేదని అన్నాడు. ఒక వేళ దాడి చేస్తే ఇప్పటి వరకు బూడిదైపోయే వాళ్లము అని పాక్ పౌరుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.