Home Page Sliderhome page sliderInternationalNewsviral

ఇరాన్ తర్వాత పాక్ కు దబిడి దిబిడే – ఇజ్రాయిల్

“ఇరాన్ అంతు చూశాక మా చూపంతా పాకిస్తాన్ పైనే” . పాక్ అంతు చూస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ పై వైమానిక దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఇజ్రాయిల్ . ఇరాన్ దేశానికి అణు క్షిపణుల తయారీలో సైలెంట్ గా సాయం చేస్తామంటూ పాకిస్తాన్ హామీ ఇవ్వడంతో..ఇజ్రాయిల్ దేశానికి చిర్రెత్తింది. పాక్ అంటే పొసగని ఇజ్రాయిల్ మరింత ఉద్వేగానికి లోనయింది. దీంతో పాక్ ను వైలెంట్ గా తన హిట్ లిస్ట్ చేర్చింది. ప్రస్తుతం ఇరాన్ లోని అణు క్షిపణి కేంద్రాలపై ఊపిరి సలపనివ్వకుండా దాడులు చేస్తూ ఇజ్రాయిల్ విధ్వంసం సృష్టిస్తుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఇప్పటికే భారీ నష్టాన్ని చవిచూసింది. ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ అణు శాస్త్రవేత్తలు చాలమంది చనిపోయారు. ఇప్పటికే 224 మంది పౌరులు చనిపోయారని ఇరాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.