Home Page SliderInternational

ఇండియాను అనుసరించిన పాకిస్తాన్.. అసలు మ్యాటరేంటంటే!

ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుగా ఉంది ఐక్యరాజ్యసమితిలో, ఉక్రెయిన్‌పై రష్యా దాడి తీర్మానం. ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రవేశపెట్టిన తీర్మానం ఓటింగ్‌కు ఇండియా గైర్హాజరయ్యింది. కేవలం ఇండియానే కాదు.. మన చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా అదే దారిలో నడిచాయి. గతంలోనూ ఐక్యరాజ్యసమితి తీర్మానం విషయంలో ఇండియా ఇదే వైఖరి అవలంబించింది. ఇండియా ఎవరివైపు ఉంటుందన్న ప్రశ్నలకు, శాంతి వైపు ఉంటుందని, ఉభయపక్షాలు కలిసి కూర్చొని, సమస్యను పరిష్కరించుకోవాలని ఇండియా స్పష్టం చేసింది. తాజాగా ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో వీలైనంత త్వరగా “సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతి” నెలకొల్పాల్సిన అవసరమంటూ పెట్టిన తీర్మానాన్ని భారత్ తిరస్కరించింది. ఓవైపు రష్యా దురాక్రమణను ప్రశ్నిస్తున్న ప్రపంచదేశాలు… యుద్ధాన్ని ఆపే విషయంలో చొరవ తీసుకొవాలని.. తద్వారా మానవాళిని పెను ప్రమాదం నుంచి బయటపడేయాలని కోరుతోంది. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి వ్యతిరేకంగా బెలారస్, ఇరిత్రియా, మాలి, నికర్‌గువా, రష్యా, సిరియా , ఏడు దేశాలు మాత్రమే వ్యవహరించాయి. ఇక 141 దేశాలు తీర్మానానికి జై కొడితే మరో 32 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. మొదట్నుంచి యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ఇండియాతోపాటు ఈసారి చుట్టూ దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అనుసరించడం విశేషం. చైనా సైతం ఓటింగ్‌కు గైర్హాజరయ్యింది. UNOలో చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ బాటలో పాకిస్తాన్ నడుస్తోందా అన్న భావన కలిగించింది.