‘పాక్ ఇక ఏకాకే’..బీసీసీఐ కీలక నిర్ణయం..
పాకిస్తాన్ ఉగ్రవాదానికి భారత్ అన్ని రకాలుగా దెబ్బకొడుతోంది. తాజాగా క్రికెట్‌లో కూడా పాకిస్తాన్‌ను ఏకాకిని చేసే ప్రయత్నంలో భాగంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుండి భారత్ టీమ్ వైదొలగాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ విషయం ఆసియా క్రికెట్ మండలికి సమాచారం ఇచ్చారు. అలాగే జూన్‌లో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుండి కూడా టీమిండియా మహిళలు పాల్గొనడం లేదని పేర్కొంది. ఎందుకంటే ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలికి పాకిస్తాన్ మంత్రి పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్నారు. పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీలలో టీమిండియా ఆడదని, భారత ప్రజల మనోభావాలను, సెంటిమెంట్లను దెబ్బతీయలేమని క్రికెట్ బోర్డు పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ల కారణంగా భారత్, పాక్‌ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

