బిపోయ్‌జాయ్ దెబ్బకు పాకిస్థాన్ అతలాకుతలం
బిపోయ్‌జాయ్ తుఫాన్ దాయాది దేశం పాకిస్థాన్‌ను అతలాకుతలం చేస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాన్ తీరప్రాంతాలను వణికించేస్తోంది. పాకిస్థాన్‌లో ఈ తుఫాన్ కారణంగా 25 మంది చనిపోయారు. 175మంది గాయపడ్డారు. ఈదురుగాలులతో చెట్లు కూలిపోయి, ఇళ్లు కూలిపోతున్నాయి. అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ గాలులతో అల్లకల్లోలమైపోతున్నాయి తీరప్రాంతాలు. కరెంటు సరఫరా నిలిచి పోయింది. వరదల కారణంగా ఇళ్లు నీటిలో మునిగిపోతున్నాయి. మరోపక్క క్యూబాలో కూడా ఈ తుఫాన్ కారణంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

