భారత్ నిర్ణయాలపై పాక్ కీలక సమావేశం
ఉగ్రదాడి ఘటనపై భారత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పాక్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. పాక్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు భేటీకి హాజరయ్యారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్ నిర్ణయంపై పాక్ అక్కసు వెళ్లగక్కింది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పాక్ అభిప్రాయపడింది. దీనిపై చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా ఎదుర్కొంటామని పాక్ మంత్రి అవాయిస్ లెఘారీ ఓ పోస్ట్ ద్వారా ప్రకటించడం జరిగింది.

