పాక్ ను అంతా ఈజీగా ఓడించలేం..
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది దేశాలు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతాయి. ఈ టోర్నీలో ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీ తీవ్రంగా ఉంటుందన్నారు. పాకిస్థాన్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవాస్కర్ తేల్చి చెప్పారు. గత వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ కు వెళ్లిన సంగతిని అందరూ గుర్తుంచుకోవాలని… ఫైనల్స్ లో ఇండియా ఓడిపోయినప్పటికీ… వరుసగా మ్యాచ్ లు గెలుచుకుంటూ వచ్చిందని తెలిపారు. ఇప్పుడు పాకిస్థాన్ కు కూడా అలాంటి అవకాశమే ఉందని గవాస్కర్ చెప్పారు. స్వదేశంలో పాకిస్థాన్ ను ఓడించడం అంత సులభం కాదన్నారు. అందుకే పాక్ ను ఫేవరెట్ గా భావిస్తున్నానని తెలిపారు.

