‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకి పాక్ ఆర్మీ కీలక నిర్ణయం..
ఆపరేషన్ సిందూర్ దెబ్బకి పాక్ ఆర్మీ బెంబేలెత్తిపోయింది. భారత్ మిస్సైళ్ల దాడులకి పాక్ ఎయిర్‌బేస్‌లు కుప్పకూలాయి. దీనితో పాకిస్తాన్ ఆర్మీ కీలక నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే ఆర్మీ జనరల్ ప్రధానకార్యాలయాన్ని మార్చాలని పాక్ ఆలోచిస్తోంది. ఇటీవలి భారత దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీలో ఆందోళన మొదలయ్యింది. దీనితో రావల్పిండి నుంచి ఇస్లామాబాద్‌కు మార్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇస్లామాబాద్ అయితే సురక్షితమని భావిస్తున్నారు పాక్ ఆర్మీ అధికారులు. ఇటీవల రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆర్మీ కార్యాలయం సమీపంలో ఈ నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ఉండడంతో వారిలో భయం పట్టుకుంది.

