పాక్ బరితెగింపు..ముంబయి అలెర్ట్
కశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడిని మరువక ముందే పాకిస్థాన్ మరో బరితెగింపు చర్యలకు పాల్పడింది. భారత్ కఠిన ఆంక్షలు ఆదేశించిన నేపథ్యంలో పాకిస్తాన్ కూడా క్షిపణి పరీక్షలకు సిద్ధమయ్యింది. నేడు, రేపు కరాచీ తీరం వెంబడి భూమి నుండి భూమి పైకి క్షిపణి ప్రయోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనితో భారత ప్రభుత్వం ముంబయి నగరంలో పలు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. నగరం అంతటా అలెర్ట్ చేశారు. పోలీసు బలగాల గస్తీ అధికం చేశారు. బీచ్‌లు, స్టార్ హోటల్స్, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. అలాగే ఢిల్లీలో కూడా పాక్ హైకమిషన్ దగ్గర భద్రత కుదింపు. పాక్ హైకమిషన్ దగ్గర బారికేడ్లు తొలగింపు చర్యలు చేపట్టారు. భారత్‌లో పాక్ ట్విట్టర్ ఖాతాపై నిషేధం విధించారు.