Home Page SliderTelangana

తెలంగాణాలో మద్యం విక్రయాలతో “పైసా వసూల్”

దేశవ్యాప్తంగా మార్చి 31తో గత ఆర్థిక సంవత్సరం ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు గత ఆర్థిక సంవత్సరానికి గాను తమ ఆర్థిక లాభ,నష్టాల చిట్టాను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణా ప్రభుత్వం కూడా తమ లాభ,నష్టాల చిట్టాను ప్రకటించింది. దీనిలో ఇప్పటికే ఆదాయ పన్ను ద్వారా తెలంగాణాకు భారీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పుడు మద్యం విక్రయాలలోనూ తెలంగాణా భారీ లాభాలు గడించినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రభుత్వానికి రూ.13,518.87 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో ముఖ్యంగా 3 జిల్లాల నుంచే 42-45% రావడం గమనార్హం. కాగా మద్యం అమ్మకాల్లో రూ.8,436.14కోట్లతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ రూ.3,752.96కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో ఉంది. తర్వాత రూ.1,329.78 కోట్లతో మేడ్చల్ 3వ స్థానంలో నిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు.