పహల్గామ్ ఎఫెక్ట్.. తిరుమలలో హై అలెర్ట్..!
జమ్మూకాశ్మీర్ లో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రత సిబ్బంది అలర్ట్ అయింది. అనుమానితులను విచారిస్తూ, వారి వివరాలను సెక్యూరిటీ సిబ్బంది సేకరిస్తున్నారు.