అతి విశ్వాసం పనికి రాదు..
ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదని అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒంటరిగా బరిలోకి దిగి చతికిలబడింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రివాల్ స్పందించారు. “ఎన్నికలు సమీపిస్తున్నాయి. వాటిని మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎప్పుడూ అతి విశ్వాసంతో ఉండకూడదనేది ఈ ఎన్నికలు నేర్పిన పాఠం. ప్రతి ఎన్నిక, ప్రతి స్థానం కఠినమైనదే. విజయం కోసం కష్టపడి పనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు” అని పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజీవాల్ వ్యాఖ్యలు చేశారు. ఆయన స్వంత రాష్ట్రం హరియాణాలో ఆప్ ఖాతా తెరవలేదు.

