అంగవైకల్యాన్ని అధిగమించి.. స్ఫూర్తిని నింపుతూ..
అంగవైకల్యం అనేది విజయానికి ఏ మాత్రం అడ్డుకాదని నిరూపించాడు ఓ విద్యార్థి. అంగవైకల్యాంతో బాధపడుతున్న ఓ విద్యార్థి కాళ్లతో పరీక్ష రాసి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని నెన్నల(M) కృష్ణపల్లికి చెందిన శంకర్ రెండు చేతుల్లేకపోయినా పట్టభద్రుడు కావాలనే పట్టుదలతో కాళ్లతోనే డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాశారు. చేతులు లేవని డీలా పడలేదు. ఎక్కడా కూడా చదువును అశ్రద్ధ చేయలేదు. శంకర్ పట్టుదలను నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

