HealthHome Page SliderNational

ఆహారంలో మార్పుల ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించండి

మానసిక ఒత్తిడి వల్ల శారీరక ఆరోగ్యం కూడా దెబ్బపడుతుంది. మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకుని, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని కూడా కుదుటపరుచుకోవచ్చు. కొంతమందికి చాక్లెట్ తింటే మూడ్ బాగుంటుంది. అలాంటప్పుడు డార్క్ చాక్లెట్‌ను ఎంచుకుంటే ఆరోగ్యమని డాక్టర్లు సలహాలు ఇస్తూంటారు. కొందరు స్వీట్స్, ఐస్‌క్రీమ్ వంటి పదార్థాలు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని భావిస్తారు. మెంటల్ స్ట్రెస్‌ను తగ్గించుకోవాలంటే జంక్ ఫుడ్స్, బిర్యానీలు, ఐస్‌క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి పదార్థాలు అప్పటికప్పుడు ఉత్తేజాన్ని ఇచ్చినా, దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటి బదులు ఓట్ మీల్, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. చాలామందికి కాఫీ, టీలు తాగడం ద్వారా తలనొప్పి వంటి బాధల నుండి ఉపశమనం పొందుతారు. కాఫీ బదులు బ్లాక్ కాఫీ, టీ బదులు గ్రీన్ టీని వాడడం వల్ల ఎక్కువ క్యాలెరీలు శరీరంలో చేరకుండా చూసుకోవచ్చు.