మాది ముస్లిం పార్టీ కాదు..
తమ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ను అందరూ ముస్లిం పార్టీ అనుకుంటారని.. అది నిజం కాదని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్ము ప్రాంతానికి చెందిన హిందూ నేత సురీందర్ కుమార్ చౌదరి తాము డిప్యూటీ సీఎం చేశామని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం కశ్మీర్ కు చెందిన పార్టీ అనే ఆరోపణలను ఆయన ఖండించారు. తమ పార్టీ జమ్మూకశ్మీర్ కు చెందిన ప్రజలందరికీ సేవ చేస్తుందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో గెలుపొందింది. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిగా పోటీ చేశాయి. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత… ఒమర్ అబ్దుల్లా తొలి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు.

