Home Page SliderInternational

“మాది కూడా కాంగ్రెస్‌ మాటే”..పాక్ రక్షణమంత్రి కీలక వ్యాఖ్యలు

జమ్ము అండ్ కాశ్మీర్‌ విషయంలో కాంగ్రెస్ వైఖరి తమకు నచ్చుతుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35ఏ పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్-ఎన్సీ వైఖరితోనే తాము కలిసివస్తామని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్‌లో కూటమి గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయం ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. ఎన్‌సీ మాత్రం 37 0 ఆర్టికల్ అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో మాత్రం పెదవి విప్పలేదు. రాష్ట్రహోదాను పునరుద్ధరిస్తామని పేర్కొంది. పాక్ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. పాక్ లాంటి ఉగ్రదేశం కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ ఎన్‌సీ కూటమికి మద్దతు ఇస్తోందంటే అర్థం చేసుకోవచ్చన్నారు. రాహుల్ గాంధీ భారత్ ప్రయోజనాలకు ఎంత విలువ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. కాశ్మీర్ ఎన్నికలు జరగబోయే సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.