home page sliderHome Page SliderTelangana

మా వేతనాలు.. మాకివ్వండి.. విరించి ఆసుపత్రిలో స్టాఫ్ ఆందోళన

గత 2 నెలలుగా జీతాలు ఆలస్యం చేస్తున్నందుకు యాజమాన్యంపై విరించి హాస్పిటల్ హౌస్ కీపింగ్, నర్సు ఆందోళన బాట పట్టారు. మా వేతనాలు మాకివ్వండి అంటున్న ఉద్యోగస్థులను ఆసుపత్రి యాజమాన్యం అసభ్యంగా ప్రవర్తిస్తున్నదని, మీకు నచ్చింది చేయండి, మేము డబ్బు ఇవ్వము అని వారు చెప్పారని.. ఒక నిరసనకారుడు మీడియాకి తెలిపాడు. పని చేసిన వేతనాలు అడిగిన పాపానికి డ్యూటీ నుంచి తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునే సరికి తమకు ఎలాంటి సమస్యలు లేవని నిరసనకారులు అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించారు. ఉన్న ఉద్యోగం పోతే తమకు మళ్లీ ఉద్యోగం దొరకడం కష్టమని, యాజమాన్యం బెదిరింపులతో వారు పక్కకు జరిగినట్లు తెలుస్తోంది. వేతనాలు అడిగితే విధుల నుంచి తొలగిస్తామని.. ఏం చేసుకుంటారో చేసుకుండి అని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. విరించి ఆసుపత్రి యాజమాన్య తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మీడియాకు కూడా చెప్పుకోలేక బెదరింపులకు పాల్పడుతున్నారని స్ఠాప్ బాధపడుతున్నారని తెలిస్తోంది. ప్రభుత్వ కార్మిక శాఖ దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.