Home Page Slidertelangana,

మా ఎమ్మెల్యే కనబడుట లేదు

మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ పది నెలలుగా కనిపించడం లేదని, వెతికి పెట్టాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆచూకీని కనిపెట్టి నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. అనంతరం క్యాంపు ఆఫీస్ ను కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ఈ మేరకు ఆఫీస్ లో కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందించి నిరసన కు దిగారు. కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. గెలిచిన నాటి నుంచి ఇప్పటికీ ఒక్కసారి కూడా గజ్వేల్ కు రాలేదన్నా రు. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. క్యాంపు ఆఫీస్ గోడకు వినతి పత్రాన్ని అతికించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి బయటకు రావాలని డిమాండ్ చేశారు.