Andhra PradeshHome Page Slider

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మాది భరోసా..కుమారస్వామి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఆందోళన వద్దని, కేంద్రప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు. ఈ స్టీల్ ప్లాంటు దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని, దీనిపై అనేకమంది ఆధారపడి ఉన్నారని తమకు తెలుసన్నారు. దీనిని రక్షించడం తమ బాధ్యత అని, ఈ ప్లాంట్ మూతపడే సమస్యే లేదని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లోని పలు విభాగాలను మంత్రి పరిశీలించారు.