ఆస్కార్ గ్రంథాలయం.. నేడు ప్రారంభించనున్న చంద్రబోస్
టిజి: భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్ తన స్వగ్రామంలో ఆస్కార్ గ్రంథాలయాన్ని నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్ చేతుల మీదుగా గురువారం దీనిని ప్రారంభించనున్నారు. ఆస్కార్ అవార్డుకు తీపిగుర్తుగా రూ.36 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించి ఆస్కార్ గ్రంథాలయం అని నామకరణం చేశారు. రెండంతస్తులతో నిర్మించిన గ్రంథాలయం భవన నిర్మాణం పూర్తయి, అన్ని హంగులతో రూపుదిద్దుకుంది.