Home Page SliderTelangana

అవయవ దానం చేయడం పునర్జన్మలాంటిది: గవర్నర్

సనత్‌నగర్: అవయవ దానం చేయడం పునర్జన్మలాంటిదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ వైద్య కళాశాలలో శుక్రవారం జరిగిన కిడ్నీ దాతల సన్మాన కార్యక్రమం, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తెల్లకోటు ప్రదానం వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల డీన్ డా.మాధురి శిరీష్ కటే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు. మరణానంతరం శరీర అవయవ భాగాలు మట్టిలో కలిసిపోకుండా అవసరమైన వారికి అందిస్తే కొత్త జీవితం ప్రసాదించిన వారమవుతామని తెలిపారు. కార్యక్రమంలో ఈఎస్ఐసీ మెడికల్ సూపరింటెండెంట్ డా.రాధిక, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.