రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్
రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా.. విపక్షాలు వాకౌట్ చేశాయి. దీనిపై ప్రధాని స్పందిస్తూ వారిపై విమర్శలు గుప్పించారు. సభను విపక్షాలు అనుమానిస్తున్నాయని, నిజాలు చెబుతుంటే భరించలేకపోతున్నారన్నారు. ప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదని, చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారని విమర్శించారు.