BRS, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఎల్లో బీసీలపై వ్యతిరేకత: బండి సంజయ్
కరీంనగర్: బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మత్తు పదార్థాలకు, మారక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్‌లో స్థానికంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఎల్లో బీసీలపై వ్యతిరేకత ఉందన్నారు. బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడానికి ఆ పార్టీకి మనస్కరించదని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్‌కు అమ్ముడుపోవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నుంచి విముక్తి కలగాలంటే బీజేపీని గెలిపించితీరాలని ఆయన కోరారు.