లోక్‌సభ స్పీకర్ పదవికి బరిలో విపక్ష కూటమి
విపక్షకూటమి అధికార పార్టీకి ట్విస్ట్ ఇచ్చింది. లోక్‌సభ స్పీకర్ అభ్యర్థి రేసులో మేము కూడా ఉంటామని తేల్చి చెప్పింది. ఈ ఉదయం వరకూ డిప్యూటీ స్పీకర్ పదవి విపక్ష కూటమికి ఇచ్చేందుకు అధికార పార్టీ సిద్దంగానే ఉంది. కానీ నేడు కాంగ్రెస్ నుండి సురేష్ కూడా నామినేషన్ వేయడంతో పోటీ ఏర్పడింది. మరోపక్క అధికార కూటమి నుండి ఓంబిర్లా ఇప్పటికే నామినేషన్ వేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇదే మొదటిసారి. విపక్ష కూటమికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వదేమో అని విపక్ష కూటమి భావించింది. దీనితో స్పీకర్ ఎన్నిక విషయంలో అధికార పార్టీకి సహకరించేది లేదని ఇండియా కూటమి అభిప్రాయం. అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, స్పీకర్ పదవులకు ఎవరు ఎన్నికవుతారో అనేది ఆసక్తికరంగా మారింది. రేపు స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అధికార పార్టీ ఫోన్ చేసి స్పీకర్ ఎన్నికకు సహకరించమని కోరింది. దీనితో తాము సహకరిస్తామని, కానీ తమ పక్షానికి సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కోరారు. కానీ సమయం మించిపోయినా వారికి ఏ రకమైన సమాధానం రాలేదు. అందుకే ఇక స్పీకర్ పదవికే నామినేషన్ వేయాలని నిర్ణయించామన్నారు.

