Home Page Sliderhome page sliderTelangana

భారత్ వైపు చూడాలంటే దేశాలకు వణుకు పుట్టాలి..

ఉగ్రవాద చర్యలకు ప్రతికార చర్యగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మోడీకి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత దేశం వైపు చూడాలంటే ఇతర దేశాలకు వణుకు పుట్టించేలా చేసిందన్నారు. ప్రజలు కూడా మోడీ నాయకత్వానికి అండగా ఉండాలని పాయల్ శంకర్ కోరారు.