ఏపీలో ఆపరేషన్ గరుడ
ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు అధికారులు. విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కడప, ఒంగోలు, విజయవాడల్లో విజిలెన్స్, ఈగల్, డ్రగ్ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 100కుపైగా బృందాలతో మెడికల్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్న మెడికల్ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ కు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని అధికారుల సూచిస్తున్నారు.