ఆపరేషన్ దోస్త్ ఆద్భుతమన్న ప్రధాని మోదీ
భూకంపం సంభవించిన టర్కీకు పంపించిన భారతీయ విపత్తు సహాయక బృందాన్ని ప్రశంసలతో ముంచెత్త్చాతారు ప్రధాని నరేంద్ర మోదీ. టర్కీ, సిరియాలో ‘ఆపరేషన్ దోస్త్’లో పాల్గొన్న సిబ్బందితో తాను సంభాషించానని ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు. విపత్తు ప్రతిస్పందన, సహాయక చర్యలలో వారి కృషి అభినందనీయమని ఆయన అన్నారు. ‘ఫిబ్రవరి 7న భూకంప ప్రభావిత దేశానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్న ప్రధాని మోదీ ఆదేశాల మేరకు మొత్తం మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అక్కడికి వెళ్లాయి. ఆపరేషన్ దోస్త్ కింద NDRF బృందం టర్గీ నుండి ఇండియాకి తిరిగి వచ్చింది. 151 @NDRFHQ సిబ్బంది & డాగ్ స్క్వాడ్‌లతో కూడిన 3 బృందాలు భూకంప ప్రభావిత టర్కీకు సహాయం అందించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు. టర్కీలోని నూర్దాగ్ & అంటాక్యా 35 వర్క్ సైట్‌లలో జట్లు సెర్చ్, రెస్క్యూ & రిలీఫ్ ఆపరేషన్స్‌తో సహా లైఫ్ డిటెక్షన్‌ను నిర్వహించాయని ఆయన చెప్పాడు. ఫిబ్రవరి 6న 30,000 మందికి పైగా మరణించిన విధ్వంసకర భూకంపం వల్ల రెండు దేశాలలోని వివిధ ప్రాంతాలు దెబ్బతిన్న తరువాత టర్కీయేతో పాటు సిరియాకు సహాయం చేయడానికి భారతదేశం ‘ఆపరేషన్ దోస్త్’ ప్రారంభించింది.

