Andhra PradeshNews

పెదపరిమి గ్రామంలో వృద్ధాలయం ప్రారంభం

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో వృద్ధాలయం ప్రారంభమైంది. మువ్వా చిన్న బాపిరెడ్డి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వృద్ధాలయాన్ని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధాలయం నిర్మాణానికి సహకారం అందించిన ఆరా ఫౌండేషన్‌ చైర్మన్‌ ఆరా మస్తాన్‌‌ను ఎంపీ అయోధ్య రామిరెడ్డి సన్మానించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సు నేర్చుకున్న విద్యార్థులకు ఆరా మస్తాన్‌ సర్టిఫికేట్లు కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, మోదుగుల వాసుదేవరెడ్డి తదితరులు హాజరయ్యారు. మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వృద్ధాశ్రమాన్ని నిర్మించడం విశేషం.