అల్లహ్ అనుమతి లభించిన వారే హజ్ యాత్రకు అర్హులు
హజ్ యాత్రకు వెళ్ళాలంటే తొలుత అల్లహ్ అనుగ్రహం ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ ఆజాం పెర్కొన్నారు . నంబూరు లొని తాత్కాలిక అంధ్రప్రదేశ్ హజ్ హౌసునుంచీ మంగళవారం ఉదయం 170 మంది హాజిలు హజ్ యాత్రకు వెళ్తున్న నేపథ్యంలో జరిగిన ముందస్తు అవగహన , ఆధ్యాత్మిక సమవేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రతి ముస్లిం జీవితంలొ స్తోమతను బట్టి హజ్ యాత్ర చెయడం ఒక విధి అని తెలిపారు . ఎంత డబ్బున్న కొందరికి హజ్ కు వెళ్లివచ్చే బాగ్యం ఉండదని , హజ్ కు వెళ్లాలంటే అల్లహ్ అనుమతి తప్పనిసరి అని వెల్లడించారు . జీవితకాలమంతా ఇస్లాము సూత్రాలను కచ్చితంగా పాటిస్తు హజ్ యాత్రకు వెళ్లేవారి ఙివితం ధన్యం అవుతుందన్నారు . హజ్ యాత్ర చేసిన వాళ్ల మంచి కోర్కెలు , విన్నపాలు అల్లహ్ యత్రలో స్వీకరించబడతాయన్నారు . యాత్ర నుంచి తిరిగి వచ్చాక హాజిలు స్వచ్చతతో కుడిన జీవితాలను కొనసాగించాలన్నారు .

రాష్ట్రంలో హజ్ కమిటి ద్వారా విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయం నుంచి హజ్ యాత్రకు వెళ్ళే అవకాశం తొలిసారిగా రాష్ట్ర హాజలకు అదృష్టంగా లభించిందన్నారు . సీఎం జగన్ మోహన్ రెడ్డి అనునిత్యం తన సమీక్షల్లో హజ్ యాత్ర గురించి నివేదికలను పరిశీలిస్తున్నారన్నారు . హాజీలకు ఎటువంటి అవసరం ఉన్నా తన కార్యాలయంలో బాధ్యులను సంసిద్దంగా ఉంచారన్నారు . ఇప్పటి వరకు వెళ్లిన హాజిల స్థితిగతులను పర్యవేక్షిస్తున్నామన్నారు . అల్లహ్ దయ వల్ల అందరూ క్షేమంగా వెళ్ళి , యత్రాను విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి స్వదేశానికి రావాలని దువా చేస్తున్నామన్నారు. మంగళవారం హజ్ హౌసు నుంచి బయల్దేరిన ప్రయాణికుల 4బస్సులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి చైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజాం, ఎమ్మెల్సి కంట్రాక్టర్ ఇషాక్ బాషా, హజ్ కమిటి సభ్యులు హఫీజ్ మన్సూర్ , బాసిత్ , ఇబాదుల్లా తదితరులు ఆకు పచ్చజెండా ఊపి విడ్కోలు పలికారు.