Horoscope TodayNews

నమ్మినవాళ్లే నట్టేట ముంచుతారు.. తస్మాత్ జాగ్రత్త

అక్టోబర్ 1 వార ఫలాలు
మేషం.. ఈ రోజు మీరు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు పరిష్కరించడానికి గడుపుతారు. మీ భౌతిక, ప్రాపంచిక దృక్పథం ఈ రోజు చాలా మార్పులను తీసుకొస్తుంది. ఏదైనా నూతన పనిని ప్రారంభించాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మ గౌరవం దెబ్బతినే అవకాశముంది. పోరాటం తర్వాత విజయం మిమ్మల్ని వరిస్తుంది.

వృషభం.. ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు మీకు సంపద లాభం ఉంటుంది. నూతన ఆర్డర్ లేదా కాంట్రాక్టులు వచ్చే అవకాశముంది. శత్రువులు ఈ రోజు మీ చేతిలో ఓడిపోతారు. వ్యాపార రంగంలో నూతన భాగస్వాములు చేరతారు.

మిథునం.. ఈ రోజు హడావిడిగా ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేక శ్రద్ధతో ఉంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తుంటే భగవంతుడి పేరు మీదుగా ప్రారంభించండి. కచ్చితంగా విజయవంతమవుతుంది. అవివాహితుల వివాహం బలంగా మారుతుంది. ఈ రోజు మీరు భార్య ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. సాయంత్రం స్నేహితుడి రాక ఆనందంగా ఉంటుంది.

కర్కాటకం.. ఈ రోజు కొంత ఖర్చు అయ్యే అవకాశముంది. వ్యాపారంలో ఎక్కువ కష్టపడినా లాభం మాత్రం తక్కువగానే ఉంటుంది. పనిలో అడ్డంకులు ఉంటాయి. కాబట్టి బాధపడకండి. ఆలోచనాత్మకంగా పనిచేయండి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఫలితంగా ఆనందకరంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సమయాన్ని గడుపుతారు. మీపై అధికారి సలహాతో పనిలో ఆలస్యం చేస్తారు.

సింహం.. ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. బిజినెస్‌లో సన్నిహితుడికి నిజయమైన విధేయతను కలిగి ఉంటారు. మీ మాటల చతురతతో అందరిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రోజు మీ చేతిలో మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. ప్రయాణాల్లో లాభాలు అందుకుంటారు.

కన్య.. ఈ రోజు మీ ఇంటికి అనేక మంది అతిథులు వస్తారు. నూతన పనిని ప్రారంభించాలనుకుంటే బాగా ఆలోచించి ఆరంభించాలి. ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోండి. భవిష్యత్తులో మీకు పనికి వస్తారు. ఉద్యోగం, వ్యాపార రంగంలో మౌనంగా ఉండటం వల్ల ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వాదనలు ఘర్షణలు నివారించండి. లేకపోతే నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు కుటుంబంలో ప్రతి ఒక్కరి అప్యాయతను అందుకుంటారు.

తుల.. ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఫలితంగా సంతోషంగా ఉంటారు. సౌందర్యం వృద్ధి చెందుతుంది. సన్నిహితుల మద్దతుతో చేసిన పొరపాటును సరిదిద్దవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆదాయం పెరగడం వల్ల లాభాన్ని పొందుతారు. పెట్టుబడుల్లో రిస్క్ చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు.

వృశ్చికం.. ఈ రోజు మీ పని మెరుగుపడటంలో ప్రత్యేక సహకారం ఉంటుంది. నిపుణుల సలహా తర్వాత మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. భార్యభర్తలు మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో అధిక వ్యయం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

ధనస్సు.. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఈ రోజు సమస్యలను మీకు మీరుగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు దానిలో కూడా విజయం సాధిస్తారు. ఈ రోజు మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.

మకరం.. ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. వ్యాపారంపై దృష్టిపెడతారు. అస్తవ్యస్తంగా ఉన్న వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు డబ్బును పెట్టుబడిగా పెట్టాలి. రుణాలివ్వడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. కళ్లు మూసుకొని ఎవ్వరిని నమ్మొద్దు.

కుంభం.. ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది. వ్యతిరేక వాదనలు ఈ రోజు మీకు హాని కలిగించవు. మీకిష్టమైన వారి సహాయంతో ఈ రోజు విజయాన్ని అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యలో మీరు విజయాన్ని పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు పొందుతారు. ఫలితంగా ప్రయోజనం అందుకుంటారు. విద్య, సాహిత్యం దిశలో జరుగుతున్న ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.

మీనం.. ఈ రోజు మీ కోరికలు నెరవేరడంలో సహాయపడతాయి. అంతేకాకుండా శుభకార్యాలు, విధులు కూడా నిర్వహించవచ్చు. ఆధ్యాత్మిక పనుల్లో మీ ఆసక్తి పెరుగుతుంది. రాత్రి సమయాన్ని కుటుంబంతో గడపడం మంచిది. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు వినోదం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. నూతన పథకాలను అమలు చేయడానికి ఈ రోజు అనుకూలమైన సమయం.