ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణమందిరం వీరు మాత్రమే చూడగలరు
ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నారు. అలాగే కృష్ణదేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ కృష్ణ దేవాలయం భారత్‌లోనే ఉంది. దీనిని కేవలం సాహసవంతులైన భక్తులు మాత్రమే చూడగలరు. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవాలంటే ఏకంగా 12 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లో గల ఈ దేవాలయం వేసవిలో తప్ప మిగిలిన కాలమంతా మంచులో కప్పబడి ఉంటుంది. హిమాచల్‌లోని కిన్నౌర్ అనే జిల్లాలో పర్వతాలపై ఉంది ఈ దేవాలయం. జన్మాష్టమి సందర్భంగా సాహసికులైన భక్తులు ఇక్కడికి పెద్దఎత్తున చేరుకుంటారు. పాండవులు హిమాలయాలలో వనవాసం, అజ్ఞాతవాసాల సందర్భంగా ఈ ప్రదేశంలో ఉన్నారని, ఇక్కడ సరస్సు ఆ సమయంలోనే ఏర్పడిందని అక్కడి వారు చెప్తుంటారు.