టీడీపీ వాళ్ళకే ఉపాధి..వైసీపీ వాళ్లకు లేదు కూలీ
అట్టహాసంగా ఉపాధి హామీ కూలీ పధకానికి తుట్లు పొడుస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో ఈఘటన వెలుగు చూసింది. మామిడిపాలెం పంచాయితీలో ఉపాధి హామీ పనులు లేక వెనక్కి వెళ్లిపొతున్న వైనం. కొందరు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తు తమకు నచ్చిన వారికే అప్పగిస్తు మిగిలిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేవలం అధికార పార్టీకి చెందిన వారికేనంటూ మిగిలిన వారికి మొడిచేయి చూపించడంతో వెనుదిరిగి వలసి వస్తుంది. దీంతో ఉపాధి లేక నానా ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు కూలీలు వాపోతున్నారు. టీడీపీ మద్దతుదారులకే ఉపాధి మాత్రమే కల్పించడంతో మిగిలిన కూలీలు ఉపాధి కరవును ఎదుర్కొంటున్నారు. దీంతో తమ కుటుంబాలు కూలీ లేక పస్తులుండాల్సి వస్తుందని కూలీలు వాపోతున్నారు. వైసీపీ సానుభూతి పరులమన్న నెపంతో స్ధానిక టీడీపీ అధికార పార్టీ నేతలు వివక్ష చూపుతున్నారని , ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని వైసీపీకి చెందిన కూలీలు తెలిపారు.