‘మా పిల్లల్ని మోదీయే తెప్పించగలరు’..జెలెన్ స్కీ
ఉక్రెయిన్ నుండి రష్యాకు వేలమంది పిల్లల్ని తరలించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. రష్యా తమపై చేస్తున్న యుద్ధాన్ని ఆపాలంటే భారత్ ప్రధాని మోదీ వల్లే అవుతుందని పేర్కొన్నారు. తమ పిల్లల్ని కూడా తమ దేశానికి మోదీ తెప్పించగలరని తెలిపారు. అనేక అంశాలలో భారత్ తిరుగులేని స్థానంలో ఉందని, ఆయన యుద్ధం చేయవద్దని రష్యాకు నచ్చజెప్పాలని, తమ దేశ పిల్లల్ని తమకు ఇప్పించాలని కోరారు. రష్యా నుండి భారత్ దిగుమతి చేసుకుంటున్న పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ఈ డిమాండ్లు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల రష్యా పర్యటనలో మోదీ యుద్ధం గురించి వ్యాఖ్యానించారు. తాము ఎప్పుడూ చర్చలు, శాంతియుత మార్గాలనే అంగీకరిస్తామని మోదీ పేర్కొన్నారు.